calender_icon.png 9 October, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఎస్సి వెబ్‌సైట్‌లో సరి చేసుకోవాలి

09-10-2025 05:24:31 PM

నిర్మల్ (విజయక్రాంతి): యుడైస్ ప్లస్ లోని పదవ తరగతి విద్యార్థుల వివరాలు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ వెబ్‌సైట్‌లో ఉంచడం జరిగిందని వాటిని సరి చేసుకోవాలని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి డి భోజన్న కోరారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ ఎస్ఎస్సి ఐడి, పాస్వర్డ్ ద్వారా వెబ్సైట్లో లాగిన్ కావాలని సూచించారు. వెబ్‌సైట్‌లో గల వివరాలను హెచ్ఎంలు తమ పాఠశాల అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం సరి చూసుకోవాలని తెలిపారు. ఏవైనా తప్పులుంటే వాటిని యుడైస్ ప్లస్ లో అప్డేట్ చేసుకోవాలని సూచించారు. తదనంతరం దీని ప్రకారమే మార్చ్ 2026లో జరగబోయే పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్ తయారు చేయబడునని పేర్కొన్నారు.