09-10-2025 05:18:24 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): పెంచిన బస్ చార్జీలు తగ్గించాలని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గురువారం హైదరాబాద్ బస్ భవన్ ముట్టడికి బయలుదేరే బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో దిండిగల రాజేందర్, ఎస్ రంగనాథ్, జె కే శ్రీను, సిలియరి సత్యనారాయణ, పరుచూరి వెంకటేశ్వర్లు, ఎలమందల వాసు, డేరంగుల పోషం, జబ్బర్, శ్రీను, రాజేష్, లలిత్, కిషన్, సతీష్, రామ్ లాల్ తదితరులు ఉన్నారు.