calender_icon.png 9 October, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

09-10-2025 05:20:06 PM

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

కరీంనగర్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటి దశలో జిల్లాలోని హుజురాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలో గల ఆరు మండలాల్లో జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. 6 జెడ్పిటిసి, 70 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శంకరపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పిటిసి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు.

కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించి రిటర్నింగ్ అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లకూ ఆస్కారం లేకుండా నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు ఈనెల 11న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, 12న నామినేషన్లు పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మొదటి విడత ఎన్నికలకు ఈ నెల 23న పోలింగ్, నవంబర్ 11న కౌంటింగ్ జరగనుంది.