calender_icon.png 9 October, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ

09-10-2025 05:10:28 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో క్షయ వ్యాధిగ్రస్తులకు గురువారం వెంకట్రావుపేటలో పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్ ఆదేశాల మేరకు బ్రోస్ బ్రౌజ్ ఎన్జీవో అనే స్వచ్ఛంద సంస్థ అందజేస్తున్న నిత్యావసర సరుకులతో కూడిన కిట్ లను ఎంపిక చేసిన లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్ వైజర్ సురేష్,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్ వైజర్లు శోభ , మార్త , హెల్త్ అసిస్టెంట్లు గఫూర్,ఇసాక్ అహ్మద్, ఏఎన్ఎం లు,ఆశావర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.