calender_icon.png 9 October, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తహీనత రాకుండా మహిళలు పోషకాహారాన్ని తీసుకోవాలి

09-10-2025 05:26:38 PM

ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషారాణి..

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో రక్తహీనత రాకుండా మహిళలు పోషకాహారాన్ని తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషారాణి సూచిస్తూ పోషకాహార మహోత్సవాలు నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు జరిగే పోషకహార మాసం కార్యక్రమాలు జరుగుతాయని మండల ఐసిడీఎస్ సూపర్వైజర్ ఉషారాణి వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం మండలంలోని ఆనేపురం ఉమ్మడి గ్రామపంచాయతీలో పోషక మాసం నిర్వహించారు.

పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా యలమంచిలి తండా-2 అంగన్వాడి సెంటర్ భూఖ్య నందినికి శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా లభించే కూరగాయలు పండ్లు తీసుకోవాలని సూచించారు తాజా కూరగాయలు పండ్లలో అనేక పోషక విలువలు ఉంటాయని అన్నారు. ముఖ్యంగా మహిళలలో రక్తహీనత రాకుండా బలమైన పోషకాహారాన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కేవలం మహిళలకే కాకుండా మగవారికి కూడా పోషకాహారం పై అవగాహన కలిగి ఉండాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సౌజన్య, అంగన్వాడీ టీచర్లు శిరీష, మల్లికాంబ, భద్రమ్మ, సరిత, తల్లులు ,గ్రామ పెద్దలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.