calender_icon.png 9 October, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నియమావళి పాటించాలి

09-10-2025 05:22:00 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో జరుగుతున్న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) గురువారం సారంగాపూర్ మండల కేంద్రంలో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎంపీడీఓ, ఎంఈఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆమె, సౌకర్యాలు, హెల్ప్‌డెస్క్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులు ఇచ్చిన వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, ప్రతి రికార్డును పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

నామినేషన్ కేంద్రాల వద్ద నిరంతర పటిష్ఠ పోలీసు బందోబస్తు కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొదటి విడుతలో తొమ్మిది జెడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్లు నేటి నుంచి 11వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించబడతాయని, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి కేంద్రంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి, అభ్యర్థులకు అవసరమైన సమాచారం అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ తనిఖీలో తహసిల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ లక్ష్మికాంత్ రావు, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.