calender_icon.png 9 October, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కఠారి దేవేందర్ రావుకు ఘన నివాళి

09-10-2025 05:16:50 PM

కరీంనగర్ (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే కటారి దేవేందర్ రావు వర్ధంతి సందర్భంగా గురువారం పద్మనాయక వెలమ పెద్దలు, కెడిఆర్ అభిమానులు జ్యోతినగర్ లోని కేడిఆర్ పార్కులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెలమ సంఘం నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించిన మహోన్నత వ్యక్తి కఠారి దేవేందర్ రావు అని అన్నారు. ఆయన నాయకులకు ఒక రోల్ మోడల్ అని, అత్యంత సాధారణ జీవితం గడిపి నిత్యం పేద ప్రజల బాగోగులకై తపించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కరీంనగర్ మునిసిపల్ చైర్మన్ గా మూడు పర్యాయాలు పనిచేసినా, కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన కరీంనగర్ లోని తన సొంత ఇంట్లో నివాసం గడిపారని, కరీంనగర్ బాగుపడితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అని విశ్వసించిన వ్యక్తి దేవేందర్ రావు అని అన్నారు.

నిరుపేదల జీవితాలను మార్చడం తన ధ్యేయంగా తీసుకొని, ఆచరించి, కార్యాచరణను రూపొందించిన మానవతామూర్తి దేవేందర్ రావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘం నాయకులు బుద్ధినేని గోపాలరావు, బోయినపల్లి ప్రవీణ్ రావు, నీలగిరి హనుమంతరావు, నర్నేని మనోహర్ రావు, బోయిన్పల్లి నర్సింగరావు, జువ్వాడ వేణుగోపాలరావు, జనగామ ప్రభాకర్ రావు, గండ్ర సంపత్ రావు, కలకుంట్ల శ్రీపతిరావు, చిట్నేని ప్రదీప్ రావు, బల్మూరి విజయసింహారావు, పొనుగోటి తిరుపతిరావు, అయిల్నేని రంగారావు, నడిపెల్లి ప్రసాదరావు, నిమ్మనేని భీమారావు, జోగినిపల్లి రఘునందన్ రావు, బోయిన్పల్లి భూపతిరావు, కోరు కంటి శ్రీనివాసరావు, వరుణ్ రావు, జోగినపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.