calender_icon.png 20 February, 2026 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశ్రమలో అగ్నిప్రమాదం

09-11-2025 01:49:35 AM

మనోహరాబాద్, నవంబర్ 8: షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో దాదాపు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కూచారం పారిశ్రామిక వాడలో ఉన్న హార్న్ బ్యాక్ ఈ మొబిలిటీ సైకిల్ పరిశ్రమలో శనివారం షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలకు పరిశ్రమలలో ఉన్న బ్యాటరీ కాయల్స్, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి.

పరిశ్రమ యజమానులు ఇచ్చిన సమాచారం మేరకు మూడు ఫైర్ ఇంజిన్‌లు వచ్చి మంటలను ఆర్పేశాయి. మంటలు చేలరేగిన సమయంలో కార్మికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు తెలిపారు.