22-12-2025 02:37:02 AM
ముస్తాబు అవుతున్న పంచాయతీ కార్యాలయాలు
ప్రమాణ స్వీకారాలకు ప్రత్యేక అధికారుల కేటాయింపు
రంగారెడ్డి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): ఎట్టకేలకు పంచాయతీలకు కొత్త పాలకులు వస్తున్నారు. పంచాయతీ పాలకవర్గం ముగిసి రెండేళ్లు గడవడంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ పోరుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ పోరును మూడు దశలో ఈ నెల 11,14,17 తేదీ లో పోలింగ్ నిర్వహించింది. ఆయా విడుత లో పోలింగ్ ముగిసిన అనంతరం గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు సభ్యులకు ఎన్నిక అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
రెండేళ్ల అనంతరం గ్రామ పంచాయతీలకు కొత్త పాలకులు కొలుదీరనుండటంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెల కొంది. ఈ నెల 22 న సర్పంచ్ పాలకవర్గం కు పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడం తో కొత్త గా గెలుపొందిన సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టను న్నారు. దీంతో పంచాయతీలను కార్యదర్శులు తమ సిబ్బందితో ముస్తాబు చేసే పనిలో ప్రస్తుతం నిమగ్నమయ్యారు.
పంచాయతీ లకు రంగులను అద్ది, మామిడి తోరణాల తో అందం గా ముస్తాబు చేస్తున్నారు. కొందరూ సర్పంచ్ లు,పాలకవర్గం సభ్యులు కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించుకునేందుకు నూతన సామగ్రిని సైతం సమకూర్చు కుంటున్నారు. పంచాయతీలకు కొత్త పాలక వర్గం రావడంతో ఇక పల్లెలో సమస్యలు తీరినట్లేనని, గ్రామాలు అభివృద్ధి బాట పడుతాయని పల్లె ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కొలువుదీరనున్న కొత్త సర్పంచులు
నేడు జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో 525 పంచాయతీలుపంచాయతీలో కొత్త సర్పంచులు, పాలకవర్గం సభ్యులు కొలువు దీరనున్నారు. అందుకోసం చురుకుగా పంచాయతీలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులు దగ్గరుండి నూతన సర్పంచుల సలహాలు, సూచనల ప్రకారం పంచాయతీ కార్యాలయ భవనా లను సుందరీకరిస్తున్నారు. రంగులతో ముస్తాబు చేయించడం తో పాటు ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.
గ్రామాలకు ప్రత్యేక అధికారులు
నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఈ నెల 20న చేపట్టాలని తొలుత పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. 20న శనివారం అమావాస్య కావడంతో తేదీని మార్చాలని కొందరు నేతలు ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ సమయాన్ని ఈ నెల 22కు మార్చుతున్నట్లు పం చాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో ఆయా పంచాయతీ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి పాలకవర్గం ప్రమాణస్వీకారం ఏర్పాటు కోసం ప్రత్యేక అధికారులను కేటాయించారు. వారి ఆధ్వర్యంలో నేడు ఆయా పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టనున్నారు.
సమస్యల కు చెక్....
గత రెండేళ్లుగా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం కేటాయించింది. కానీ వారికి బాధ్యతలు అప్పగించింది కానీ ఎక్కడ నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆయా పంచాయతీల్లో సమస్యలు పేరుకుపోయాయి. పంచాయతీల నిర్వహణ తమకు బుద్ధిబండగా మారిందని ఆయా పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వానికి విన్నవించారు. పంచాయతీల్లో చెత్త బండ సంబంధించిన ట్రాక్టర్లకు డీజిల్ పోయలేని దుస్థితి ఏర్పడింది.
కొన్ని పంచాయతీల్లో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చందాలు వేసిమరి చెత్త సేకరణ చేసే టాక్టర్లకు డీజిల్ నిర్వహణకు పైసలు చందాలు వేసుకొని కార్యదర్శులకు అప్పచెప్పారు. మరికొందరు పంచాయతీ కార్యదర్శులు తాము పంచాయతీ నిర్వహణ చేయలేమంటూ తమ జాబులకు సైతం రిజైన్ చేసిన గతంలో సైతం ఉన్నాయి. గత రెండేళ్లలో పాలకవర్గాలు లేక పంచాయతీల పాలన సైతం పడక వేసింది.
ఆయా జీపీ ల లో సమస్యలు పేరుకుపోయి.. పాలన ఆస్త వ్యస్తంగా మారిందని, కొత్త సర్పంచుల రాకతో ఇక సమస్యలు తీరినట్లేనని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. అభివృద్ధి పనుల్లో వేగం పెర గనుందని అధికారులు సైతం పేర్కొంటున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో స్థానిక పాలకులు లేక బోసిపోయిన గ్రామ పంచాయతీ లకు ఇక నుంచి కొత్త పాలకవర్గం తో కొత్తకళ వచ్చింది.