22-12-2025 02:53:10 AM
మేడ్చల్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వరదలు, పరిశ్రమల ప్రమాదాల నివారణపై 22వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరిగే మాక్ ఎక్స్సజ్ ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) చెర్లపల్లి స్మార్ట్ టెర్మినల్ (హైదరాబాద్ టెర్మినల్) సర్వే నెం. 183, ఫేజ్ III, మహాలక్ష్మి నగర్, చెర్లపల్లి, సికింద్రాబాద్ లో నిర్వహించబోతున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు.
పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి, ప్రాణనష్టం తగ్గించేందుకు ఏ చర్యలు తీసుకోవాలి, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనే అంశాలపై ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మాక్ డ్రిల్ను పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని, అలాగే మాక్ డ్రిల్ నిర్వహణకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ యాజమాన్యం సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రమాదాలలో ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా జరుగకుండా ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.