calender_icon.png 22 December, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

22-12-2025 02:55:41 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 21 (విజయక్రాంతి) : జిహెచ్‌ఎంసి, ఎల్బీ నగర్ జోన్ ఘట్ కేసర్ సిర్కిల్ ఈడబ్ల్యూఎస్ కాలనీ లోని వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వెంకటాపూర్ నీలిమ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నీలిమ హాస్పిటల్ వారికీ ధన్యవాదములు తెలుపుతూ, అదేవిధంగా స్వామి వివేకానంద యువజన సంఘం వారికీ ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టి దాదాపు 500 మందికి ఉచిత వైద్య సదుపాయాలు అందించటం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఉచితంగా పేద ప్రజలకు వైద్యం చేసి వారికీ 50 శాతం డిస్కౌంట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అని ఈ కార్డు ద్వారా హాస్పిటల్ లో 50 శాతం వైద్యం తక్కువ ఖర్చుకు చేస్తారని అదేవిధంగా గర్భిణీ మహిళలకు కూడా నార్మల్ డెలివరీ కి తక్కువ ఖర్చు అయ్యేలా వైద్యం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు దేవేందర్ ముదిరాజ్, ఈడబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు పంతులు, నాయకులు శశిధర్, నాగభూషణం, జి. రవీందర్, గోపాల్ గౌడ్, పావన్, వైద్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.