22-12-2025 02:57:17 AM
కలెక్టర్ మను చౌదరి వెల్లడి
మేడ్చల్, డిసెంబర్ 21(విజయ క్రాంతి): కలెక్టరేట్లో 22వ తేదీన నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ మను చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల వీడిది ముగించుకొని తిరిగి ఢిల్లీ ప్రయాణం అవుతున్నారని, అంతేగాక విపత్తు సమయంలో నివారణ చర్యలపై చర్లపల్లి లో నిర్వహించనున్న మాకు డ్రిల్ ఏర్పాట్ల పనులలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు తెలిపా రు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.