calender_icon.png 7 August, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్నికి ఆహుతి

07-08-2025 01:26:54 AM

 పటాన్ చెరు/గుమ్మడిదల సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం శివారులోని గుబ్బ ఫార్మా కోల్డ్ స్టోరేజ్‌లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఏర్పడి క్షణాలలోనే పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. స్టోరేజ్‌లో మొత్తం 36 మంది పనిచేస్తున్నారని.. ప్రమాద సమయం నాటికి కార్మికులందరూ వెళ్లిపోవడంతో ప్రాణనష్టం జరగలేదని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు.