calender_icon.png 26 October, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాదర్‌ఘాట్‌లో కాల్పులు కలకలం

25-10-2025 06:02:21 PM

హైదరాబాద్: చాదర్‌ఘాట్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఓ దొంగపై హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ కాల్పులు జరిపారు. ఈ ఘటన చాదర్ ఘాట్ విక్టోరియా గ్రౌండ్ వద్ద జరిగింది. సెల్ ఫోన్ దొంగలించిన వ్యక్తిని పట్టుకుంటేందుకు డీసీపీ చైతన్య, ఆయన గన్ మెన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో సెల్ ఫోన్ దొంగ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నించిన తోపులాటలో  కిందపడిపోయిన డీసీపీ చైతన్య గన్‌మెన్‌ నుంచి వెపన్ తీసుకుని పారిపోతున్న సెన్‌ఫోన్ స్నాచర్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరికి గాయాలు అయ్యాయి. గాయపడిన దొంగను నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.