30-08-2024 01:50:18 AM
బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): చెరువుల ఆక్రమణల తొలగింపును బీజేపీ స్వాగతిస్తోందని, అయితే పాతబస్తీ, సల్కం చెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చాకే.. మిగతావి కూల్చాలని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమండ్ చేశారు. సల్కం చెరువులో అక్రమంగా నిర్మించిన ఒవైసీ భవనాలకు ప్రభుత్వం కావాలనే సమయం ఇస్తోందని ఆరోపించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాజకీయ నాయకుడు కావాలనుకుంటే ఖాకీ వదిలి ఖద్దరు దుస్తులు వేసుకోవాలని పేర్కొన్నారు.
గురువారం ఆయన అసెంబ్లీ ఆవరణలోని మీడియా హాల్లో మాట్లాడుతూ.. హైడ్రా ఒక వర్గం వారినే టార్గెట్ చేసి, మిగతా వారిని రక్షిస్తోందని ఆరోపించారు. ఎంఐఎంకు సీఎం భయపడి పాతబస్తీ వైపు చూడటం లేదని, ఒవైసీ విద్యా సంస్థలకు ఒక న్యాయం, మిగతా వారికి ఒక న్యాయమా? అని నిలదీశారు.