calender_icon.png 26 January, 2026 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తాం

30-08-2024 01:50:35 AM

  1. త్వరలో పోస్టులన్నీ భర్తీ.. కోచ్‌లను నియమిస్తాం 
  2. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం  

కరీంనగర్, ఆగస్టు 29 (విజయక్రాంతి): కరీంనగర్ క్రీడాపాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, కోచ్‌లను నియమిస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రాంతీ య క్రీడా పాఠశాలలో గురువారం ధ్యాన్‌చ ంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అ ర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు క్రీడా పాఠశాలలు మంజూరు కాగా అందులో ఒకటి కరీంనగర్‌కు కేటాయి ంచామని తెలిపారు.

వివిధ రకాల క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారి చిత్రపటాలతోపాటు వారి చరిత్ర ను తెలిపే విధంగా క్రీడా పాఠశాలలో గ్యాల రీ ఏర్పాటు చేయాలని సూచించారు. కరీంనగర్ క్రీడా పాఠశాలలో ఈత కొలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం క్రీడాకారుల కు ట్రాక్‌సూట్‌తోపాటు స్పోర్ట్స్ షూలను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడా పాఠశాల విద్యార్థులు యోగా, కరాటే, జిమ్నాస్టి క్స్‌తో ఆకట్టుకున్నారు. కలెక్టర్ పమేలా స త్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, ఆర్డీవో మహేశ్వర్, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్, క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ లీలాప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.