calender_icon.png 7 July, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టిలో చేతులు-భారతదేశంలో హృదయాలు

06-07-2025 10:42:14 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): హరిత భారత్ లక్ష్యంగా చిల్డ్రన్ ఇస్లామిక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా మట్టిలో చేతులు-భారతదేశంలో హృదయాలు అనే నినాదంతో జమాతే ఇస్లామీ హింద్(Jamaat-e-Islami Hind) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 25 నుండి జూలై 25 వరకు ఆరు సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు ఒక పిల్లలతో దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జమాతే ఇస్లామీ హింద్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హై జావిద్, పట్టణ అధ్యక్షులు ఎంఏ మోహిద్ తెలిపారు. ఆదివారం  స్థానిక ఫారన్ మోడల్ స్కూల్, కాలేజీ ఆవరణలో పిల్లలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ పెద్దపల్లి సభ్యులు వెంకటేశ్వర్ మాట్లాడుతూ... భారతదేశంలో ఒక వ్యక్తికి కేవలం 20 చెట్లు మాత్రమే ఉన్నాయని, కెనడాలో ఒక వ్యక్తికి 9,000 చెట్లు, చైనాలో ఒక వ్యక్తికి 1500 చెట్లు ఉన్నాయని, భారతదేశంలో అడవి సంపద 33 శాతం నుండి 15 శాతానికి పడిపోయిందని, కాబట్టి పిల్లలు చిన్నతనం నుండే చెట్లను పెంచే అలవాటును ఏర్పరచుకోవాలని దీని ద్వారా భారత దేశంలో అడవి సంపద పెరిగి అనేక లాభాలు ఉంటాయని, జమాత్ ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో పిల్లలచే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని తెలిపారు.

అనంతరం జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ చెట్లు సమస్త మానవాళికి ఉపయోగపడతాయని, చెట్లను పెంచడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గి, భారతదేశం అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావేటి రాజగోపాల్, మీసాల సత్యనారాయణ, వేల్పుల రమేష్, జైపాల్ రెడ్డి, సాయిలు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జవేరియా కౌసర్, పట్టణ అధ్యక్షురాలు రషీదా, కన్వీనర్ మాలిహా ఇరం, మహిమోద, నజియా, జమాత్ సభ్యులు పాల్గొన్నారు.