calender_icon.png 7 July, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి మత్తులో దొంగతనం

07-07-2025 12:15:26 AM

  1. 17 తులాల బంగారం, 79 తులాల వెండి

2 కిలోల గంజాయి, బైక్ స్వాధీనం,  దొంగతనం కేసులో ఇద్దరు మైనర్లు 

నల్లగొండ టౌన్, జూలై 6 : సోషల్ మీడియాలో రీల్స్ కి అలవాటు పడి, అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై రాత్రి వేళలో తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనాలకి పాల్పడుతున్న ఇద్దరు మైనర్ బాలురు, ఒక నిందితుడు  వారికి సహకరిస్తున్న ఒక మహిళని అరెస్ట్ చేసి వారి వద్ద వీరి  వద్ద నుండి 17 తులాల బంగారం, 79 తులాల వెండి, 50 వేల విలువ గల 02 కిలోల గంజాయి, పల్సర్  స్వాధీనం చేసుకున్నట్టు  జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 30న  తన ఇంటిలో 22 తులాల బంగారం, 80 తులాల వెండి దొంగతనం జరిగిందని గాలి యాదయ్య నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో నార్కట్పల్లి సీఐ,ఎస్‌ఐ  పలు బృంధాలుగా ఏర్పడి ఆదివారం నార్కెట్ పల్లి గ్రామ శివారులోని రెడ్డయ్య ఫ్యాక్టరీ ప్రక్కన వెంచర్ లో నలుగురు వ్యక్తులు నార్కెట్ పల్లి చుట్టు ప్రక్కల అవసరం ఉన్న వ్యక్తులకు గంజాయి అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.

ఈ మేరకు నార్కెట్ పల్లి గ్రామ శివారులో రెడ్డయ్య ఫ్యాక్టరీ ప్రక్కన వెంచర్ దగ్గరలో వెళ్ళి అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు వ్యక్తులను పట్టుకొన్నారు. వారిని విచారించగా సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఒక పథకం ప్రకారం 2 కేజీల గంజాయిని కొనుగోలుచేసి  గంజాయితాగే వారికి నార్కెట్ పల్లి చుట్టు ప్రక్కల అవసరం ఉన్న వ్యక్తులకు గం జాయిని అమ్మాలని నిర్ణయించుకున్నామని తెలుపగా వెంటనే నార్కట్పల్లి పోలీసులు   పట్టుబడి చేసి నిందితుల వద్ద నుండి 2 కేజిల గంజాయి,

బంగారు గాజులు, బంగారు పుస్తెలతాడు, బంగారు నక్లెస్, సిల్వర్ కుంకుమ భరణీలు, బంగారు చెవి రింగ్స్, బంగారు సదా రింగ్, బంగారు మాటీలు, గోల్ కాయిన్స్,  వెండి పట్టాగొలుసులు, వెండి కాయిన్స్, వెండి విగ్రహాలను మొత్తం 17.1 తులాల బంగారం, 79 తులాల వెండి మరియు 1 ద్విచక్ర వాహనన్ని స్వాధీనపరచుకొని  నిందితులను   రిమాండ్ కు తరలించినట్లు  తెలిపారు.

వీరిపై  గంజాయికు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ ఉండటంతో జవహర్ నగర్, నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.  నల్లగొండ  శివరాం రెడ్డి  పర్యవేక్షణలో నార్కెట్ పల్లి సీఐ  నాగరాజు ఆద్వర్యం లో నార్కెట్ పల్లి ఎస్త్స్ర క్రాంతికుమార్, వారి సిబ్బంది ఆంజనేయులు, రాము, సత్య  నారా యణ,  హరిప్రసాద్, శివశంకర్, తిరుమల్, శ్రీ క్రిష్ణ, మహేశ్ లను జిల్లా  ఎస్పీ అభినందించారు.