calender_icon.png 17 August, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు

13-08-2025 01:12:55 AM

15, 16న హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): హరేకృష్ణ మూవ్‌మెంట్  హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్‌లోని శ్రీ రాధా గోవింద ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు ఈ నెల 15, 16న నిర్వహించనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులందరికీ లడ్డూ గోపాలుని, ఝూలన్/ ఉంజల సేవలో పాల్గొనే ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. 17న  నందోత్సవం, వ్యాసపూజా మహోత్సవం నిర్వహిస్తున్నారు.

భారతీయ సనాతన సంప్రదాయాలను, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే హరే కృష్ణ ఛాలెంజ్, కృష్ణ కిడ్స్, జప క్లబ్, సాంప్రదాయ నృత్యగాన సేవల వంటి సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. జన్మాష్టమి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని హరేకృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభు ఆహ్వానం పలికారు. కాగా హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్  బంజారా హిల్స్ సహా హరే కృష్ణ హెరిటేజ్ టవర్ నార్సింగి, హరే కృష్ణ కల్చరల్ సెంటర్ కంది, సంగారెడ్డి కేంద్రాల్లోనూ ఈ నెల 16న ఉత్సవాలు జరుగుతాయి.