calender_icon.png 21 July, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదు ఫైటర్ జెట్లు కూలాయి

20-07-2025 12:00:00 AM

  1. భారత్, పాక్ యుద్ధంపై ట్రంప్ స్పందన
  2. ఆ విమానాలు ఏ దేశానివో చెప్పని అమెరికా అధ్యక్షుడు
  3. బ్రిక్స్ కూటమికి ట్రంప్ మరోసారి హెచ్చరికలు

న్యూయార్క్, జూలై 19: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత్, పాక్ మధ్య జరిగిన పరస్పర దాడుల్లో 5 యుద్ధ విమానాలు కూలినట్టు ట్రంప్ ప్రకటించారు. రిపబ్లికన్ దేశ పర్యటనకు వచ్చిన ట్రంప్ శనివారం డిన్నర్ భేటీలో ఈ వ్యాఖ్యలు చేసిన ట్టు తెలుస్తోంది. కానీ ఏ దేశ యుద్ధ విమానాలు కూలిపోయాయన్న విషయాన్ని ఆ యన ఎక్కడా స్పష్టం చేయలేదు.

‘ఇది నమ్మలేరు.. గాలిలోనే యుద్ధ విమానాలను పేల్చే శారు. నాలుగో.. అయితో మొత్తానికి యుద్ధ విమానాలు మాత్రం కూలిపోయాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ జరగడానికి తానే కారణమని ట్రంప్ మళ్లీ నొక్కిచెప్పారు. ఎన్నో యు ద్ధాలను ఆపామని.. అందులో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం కూడా ఉందన్నారు.

రెండు అణు దేశాల మధ్య కొత్త తరహా యుద్ధం జరిగిందని, అయితే అది పెద్దదిగా కాకుండా వాణిజ్యం ద్వారా యుద్ధానికి బ్రేక్ వేశామన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మే 7వ తేదీన భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విష యం తెలిసిందే.

అయితే మినీయుద్ధంలో భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు పాకిస్థాన్ ఒక సంద ర్భంలో పేర్కొంది. త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్ మాత్రం భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు కోల్పోయామని పేర్కొన్నారు. అయితే ఆయన కూ డా ఎన్ని విమానాలు కూలాయన్న సంఖ్య మాత్రం చెప్పలేదు. 

బ్రిక్స్ కూటమి చాలా చిన్న గ్రూప్: ట్రంప్

వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్ బ్రిక్స్ కూటమిపై మరోసారి విరుచుకుపడ్డారు. బ్రిక్స్ కూటమి చిన్న గ్రూప్ అని.. ఆ దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే 10 శాతం అదనపు సుంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. తమతో ఆటలు వద్దని.. అమెరికా డాలర్‌కు గ్లోబల్ రిజర్వ్ హోదా ఉందని గుర్తు చేశారు. క్రిప్టో కరెన్సీ చట్టబద్ధతకు సంబంధించిన ‘జీనియస్’ బిల్లుపై సంతకం సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.