calender_icon.png 21 July, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే వారం విదేశీ పర్యటనకు ప్రధాని

20-07-2025 12:00:00 AM

  1. 23 నుంచి 26 వరకు యూకే, మాల్దీవ్స్‌లో పర్యటన
  2. దౌత్య విభేదాల అనంతరం తొలిసారి ద్వీపదేశం మాల్దీవ్స్‌కు మోదీ
  3. భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌పై సంతకం చేసే అవకాశం
  4. మాల్దీవ్స్ 60వ స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని

న్యూఢిల్లీ, జూలై 19: భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై 23 మధ్య యూకే, మాల్దీవ్స్ దేశాల్లో పర్యటించనున్నారు. మాల్దీవ్స్‌తో దౌత్య విభేదాల అనంతరం ప్రధాని మాల్దీవ్స్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. 23, 24 తేదీల్లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటించి.. పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. చరిత్రాత్మక ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశం ఉంది.

ఈ ఒప్పందం అమల్లోకి వస్తే.. భారత్ యూకేకు ఎగుమతి చేసే 99 శాతం ఎగుమతులపై సుంకాలు భారీగా తగ్గనున్నాయి. బ్రిటీష్ నుంచి కార్లు, వైన్ తదితరాలు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. గతేడాది మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో చాలా మంది భారతీయులు మాల్దీవ్స్ పర్యటనలు రద్దు చేసుకున్నారు. దీంతో మాల్దీవ్స్ పర్యాటకానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.

ఈ సంఘటన అనంతరం తొలిసారి ప్రధాని మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్తున్నారు. జూలై 25 తేదీల్లో ప్రధాని మాల్దీవ్స్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 26న జరిగే మాల్దీవ్స్ 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మాల్దీవ్స్ ప్రెసిడెంట్‌గా మొహమ్మద్ మయిజ్జు బాధ్యతలు స్వీకరించిన అనంతరం 2024 అక్టోబర్‌లో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ హోదాలో భారత్‌లో పర్యటించారు.