15-10-2025 04:19:08 PM
మండల పశు వైద్య అధికారి డాక్టర్ అజయ్
చిట్యాల,(విజయక్రాంతి): పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయించాలని మండల పశు వైద్య అధికారి డాక్టర్ అజయ్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గోపాలపురం గ్రామంలోని 250 పశువులకు ఉచితంగా గాలికుంటు టీకాలను వేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చిట్యాల మండలంలోని అన్ని గ్రామాలలో ఉచిత గాలి కుంటు టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఇట్టి కార్యక్రమాన్ని 3 నెలలు దాటిన అన్ని ఆవు,గేదె జాతి పశువులకు గాలికుంటు టీకాలు వేపించూకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ సిబ్బంది కవిత, దివ్య, కరుణాకర్, సుజాత, గోపాలమిత్ర లక్ష్మణ్, పశుమిత్ర రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.