calender_icon.png 21 May, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం మంత్రులకు టియుడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో వినతిపత్రం

20-05-2025 11:55:32 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేసే విషయమై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy), రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu)లకు టియుడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రులకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ... జిల్లాలో పని చేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తున్న విధంగా 250 గజాల ప్రభుత్వ స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.

అలాగే జర్నలిస్టుల కోసం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి బదులు రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలని, వివిధ కారణాల వల్ల మృతి చెందే జర్నలిస్టులకు రైతు బీమా వలే రూ.10 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలనీ కోరారు. అక్రిడిటేషన్ కార్డు గల జర్నలిస్టులందరికి ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా చొరవ చూపాలని, జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో 50 నుంచి 75% వరకు రాయితీ కల్పించాలని, జిల్లా కేంద్రంతో పాటు మంథని, సుల్తానాబాద్, ఆయా మండల కేంద్రాల్లో ప్రెస్ భవన్ ల కోసం ప్రభుత్వ స్థలాలు కేటాయించి, భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలనీ కోరారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తప్పకుండా మీ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. 

ఇళ్ల స్థలాలపై కలెక్టర్ కు ఫోన్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు

జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గాను తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు గాను ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో గుర్తించాలని శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షకు ఫోన్ చేసి ఆదేశించారు. స్థలాలు గుర్తించగానే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని, ఈ విషయమై పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ కలిసి మాట్లాడుకుని తమ సమస్యను పరిష్కరిస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుర్రసంపత్ కుమార్ గౌడ్, రాష్ట్ర మఫిషియల్ కమిటీ సభ్యులు సామల హరికృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమూర్తి యాదవ్, భూకల సారయ్య, సీనియర్ జర్నలిస్టులు గుడ్ల శ్రీనివాస్, కేతిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, కొడారి మల్లేష్ యాదవ్, కల్వల శంకర్, తిరుపతి గౌడ్, లక్ష్మీపతి, అశోక్, సతీష్ రెడ్డి, రంజిత్, నాగపురి తిరుపతి, జె లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.