calender_icon.png 20 May, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

20-05-2025 06:30:25 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామానికి చెందిన కమ్మరి కథ లచ్చయ్యకు గ్రామ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్రపు వెంకటేశం ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎం సహాయనిధి(CM Relief Fund) చెక్కును మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కమ్మరి కథ లచ్చయ్య గతంలో సీఎం సహాయ నిధి కొరకు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ద్వారా మంజూరైన 60 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని గుర్రపు వెంకటేశం పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుర్రపు శ్రీనివాస్, రాజం గంగారం, చీకోటి జగన్, కాసిం, బాలయ్య, కిష్టయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.