20-05-2025 11:02:32 PM
మరొకరికి తీవ్ర గాయాలు..
తలమడుగు (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి(కే) గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎస్సై రాధిక(SI Radhika) తెలిపిన వివరాల ప్రకారం... కొలంగూడకి చెందిన సిడాం సురేష్(22) వ్యవసాయ పొలంకు ట్రాక్టర్ పై వెళ్తుండగా ప్రమాదవశత్తు ట్రాక్టర్ పైన పడడంతో సురేష్ అక్కడికక్కడే మృతి చెందారన్నారు. మరోవ్యక్తి ప్రణీత్ కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్ఐ పేర్కొన్నారు.