calender_icon.png 21 May, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోండుగూడెం వాగు ఒడ్డున.. గుర్తుతెలియని మృతదేహం

20-05-2025 10:56:00 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్(Kasipet Police Station) పరిధిలోనీ గోండు గూడెం వాగు ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం పోలీసులు  గుర్తించారు. కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. మామిడి గూడ గ్రామపంచాయతీ కార్యదర్శి బిరుదుల శ్వేతకీ పెద్దనపల్లి గ్రామానికి చెందిన చేండే నవీన్ గోండుగూడ శివారులోని వాగు ఒడ్డున గుర్తుతెలియని మృతదేహం ఉందని ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఆమె సమాచారం ఇచ్చారు. ఇలా గుర్తు తెలియని వ్యక్తి చనిపోయిన విషయం తెలుగులోకి వచ్చింది.

ఈ మేరకు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి అస్తిపంజరం బయటికి తేలింది. చనిపోయిన వ్యక్తి బ్లూ కలర్ షర్టు, బ్లూ కలర్ ప్యాంటు ధరించాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు నెల రోజుల క్రితం చనిపోయినట్లుగా భావిస్తున్నారు. మృతుడి వయసు(40) సంవత్సరాలు ఉంటుంది. కాగా ఓసీపీ మట్టి కుప్ప పైనుండి ప్రమాదవశాత్తు జారి పడటం వల్ల గానీ, మరే ఇతర కారణాల వల్ల చనిపోయి ఉండోచ్చని భావిస్తున్నారు. మృతుడి కుడి కాలుకి బోన్ ఫ్యాక్చర్ కావడంతో అమర్చిన ప్లేట్స్, ఎడమ చేతికి  బోన్ ఫ్రాక్చర్ తో వేసిన ప్లేట్స్ బయటపడ్డాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.