20-05-2025 11:09:28 PM
మణుగూరు (విజయక్రాంతి): పినపాక నియోజకవర్గంలోని మణుగూరు పట్టణంలో ఉన్న కిన్నెరా ఫంక్షన్ హాల్‌లో మంగళవారం పినపాక నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పొదెం వీరయ్య(Sri Podem Veeraiah), పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) అధ్యక్షత వహించగా, తెలంగాణ రాష్ట్ర పీసీసీ అబ్జర్వర్లుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు డా. పి. శ్రవణ్ కుమార్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీ పి. ప్రమోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ పునర్వ్యవస్థీకరణకు చర్యలు ప్రారంభించామని, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశాన్ని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.