calender_icon.png 27 July, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలకు వరదసాయం

27-07-2025 01:18:42 AM

రూ.కోటి చొప్పున 33 కోట్లు విడుదల

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.కోటి చొప్పున 33 జిల్లాలకు రూ.33 కోట్లను విడుదల చేసింది. ప్రజలను రక్షించడమే కాకుండా, భారీ వర్షాలు, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందు కోసం ఎస్డీఆర్‌ఎఫ్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిధులను విడుదల చేశారు. తెలంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా జిల్లాల్లో ఈ వర్షాలు, వరద లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరద సహాయక కార్యకలాపాల కోసం ఈ నిధులను విడుదల చేశారు.