27-07-2025 01:20:07 AM
ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్‌ఏ ఫహీం
హైదరాబాద్, జులై 26 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని పుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం మండిపడ్డారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ వల్ల అనేక సమస్యలు ఎదురవడంతో పాడి కౌశిక్ రెడ్డి ఇలాం టి ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. బీ ఆర్‌ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేటీఆర్‌ను కౌశిక్‌రెడ్డి అడగాలని ఆయన సూచిం చారు.
శనివారం ఆయన గాంధీభవన్‌లో మీ డియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి భార్య ఫోన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ట్యాప్ చేయించారని విమర్శలు చేయడం తగదన్నారు. బీఆర్‌ఎ స్ అధికారంలో ఉన్నప్పుడు జడ్జీలు, రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఫిక్సర్ అని, గతంలో రంజీ మ్యాచ్‌లో ఫి క్సింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారని ఫహీం గుర్తు చేశారు. ఐపీఎల్ కంటే ముందు ఐసీఎల్ అని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ మొదలుపెడితే.. పాకిస్థానీలతో కౌశిక్‌రెడ్డి చేతులు కలిపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. సీఎంపై మరోసారి కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని ఫహీం హెచ్చరించారు.