01-09-2025 11:21:14 PM
ఇంద్రవెల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మాటిస్తే కచ్చితంగా నిలబెట్టుకుందని, సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తుందని ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తం పేర్కొన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తం మాట్లాడుతూ... ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసన సభలో చట్ట సవరణ బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు