calender_icon.png 7 September, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయ్యా అనూష మృతి కేసులో మరో ముగ్గురు నిందితుల అరెస్ట్

02-09-2025 12:00:00 AM

కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రసన్న కుమార్ 

సూర్యాపేట, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) :  జిల్లాలోని మోతె మండలం రాఘవపురం కు చెందిన బయ్య అనూష అక్రమ అబార్శన్ కేసులో నిందితులైన మరో ముగ్గురును అరెస్టు చేసి కోర్టుకు రిమాండు చేసినట్లు డీస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు.

ఈసందర్బంగా జిల్లా కేంద్రంలో సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. మృతురాలు బయ్య అనూష అక్రమ అబార్షన్ మృతి కేసులో 10 మంది నిందితులు ఉండగా అందులో గతంలో 7గురిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారిలో ఉన్నారన్నారు.

ఆ ముగ్గురిలో పట్టణంలోని ఒమేగా ఆసుపత్రి నిర్వాహకులు గోరెంట్ల సంజీవ, వీరబోయిన వేణు, స్కానింగ్, అబార్షన్ చేయడానికి సహకరించిన ఆర్‌ఎంపీ జాల జానయ్య కొంతకాలంగా తప్పించుకొని రితిక హోటల్ దగ్గర అనుమానస్పదంగా తిరుగు తున్నారనే సమాచారం రాగా అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ ఏడుకొండలు పోలీస్ సిబ్బంది ఉన్నారు.