02-09-2025 12:00:00 AM
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు
తలకొండపల్లి,సెప్టెంబరు 1:గొర్రెలను మేపడానికి పొలానికి వెళ్లిన గొర్రెల కాపరిపై ఫారెస్ట్ అదికారి దాడి చేశాడని భాదితుడు సోమవారం తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.భాదితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన కటికెల నారాయణయాదవ్ (70)గత నెల 30వ తేదిన తన కున్న గొర్రెలను మేపేందుకు చీపునుంతల గ్రామ శివారులోని పొలాలకు వెళ్లాడు.
ఈ క్రమంలో గొర్రెల మందలోని కొన్ని గొర్రెలు పొలాల పక్కనే ఉన్న ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లాయి.ఫారెస్ట్ ఏరియాలో ఉన్న బీట్ ఆఫీసర్ మహ్హమ్మద్ అబ్దుల్ అజీజ్ గొర్రెలు ఫారెస్ట్ ఏరియలోకి రావడం గమనించి దీంతో కోపోద్రిక్తుడైన ఒక్క సారిగా గొర్రెల కాపరి నారాయణయాదవ్ పై దాడి చేసి గాయపరిచమే కాకుండా మందలోని ఒక గొర్రె పొటేలును తీసుకెళ్లాడు.
జరిగిన విషయం రెండు రోజుల తరువాత భాదితుని ఇంట్లో తెలిసింది.జరిగిన సంఘటనపై భాదితుడు నారాయణయాదవ్ కుటుంబ సభ్యులు తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ విషయమై పత్రికా విలేకరులు ఫారెస్ట్ బీట్ అదికారిని వివరణ కోరగా గొర్రెల కాపరిపై ఎలాంటి దాడి చేయలేదని,ఫారెస్ట్ పరిదిలోకి గొర్రెలు రావడంతో మందలించి నట్లు చెప్పారు.తీసుకెళ్ళిన గొర్రెను అక్కడే నర్సరీలో ఉంచినట్లు వివరించారు.