11-10-2025 05:07:41 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): పట్టణంలోని పూల వ్యాపారస్తులు సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే సారయ్య సమక్షంలో శనివారం ఏఐటీయూసీ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పూల సంఘానికి అధ్యక్షులుగా కే సారయ్య, అధ్యక్షుడిగా ఖాజా పాషా, కార్యదర్శిగా నాగుల్ మీరా, 25 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఖాజా పాషా, నాగుల మీరా మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐలో తామంతా చేరుతున్నట్లు ప్రకటించారు. సిపిఐ పార్టీ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీతో కలిసి పని చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్, బంధం నాగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి బాస శ్రీనివాస్, బ్రాంచి కార్యదర్శి నజీర్ అహ్మద్, ఉపాధ్యక్షులు దాసరి రాజారామ్, గడదాసు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.