calender_icon.png 25 August, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్పత్తి రంగాలపై కేంద్రీకరించండి

25-08-2025 12:36:35 AM

రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి 

మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 24: స్కీం వర్కర్లు, అసంఘటి కార్మికులు, సాంప్రదాయ కార్మికులే కాకుండా, ఉత్పత్తి రం గాలైన కీలకమైన పరిశ్రమలు మరియు విద్యుత్తు, ట్రాన్స్పోర్ట్, రైల్వే తదితర అత్యంత కీలకమైన రంగాలపై కేంద్రీకరించి పనిచేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. ఆదివారం సిఐటియు జిల్లా జనరల్ బాడీ సమావేశం దిప్లా నాయక్ అధ్యక్షతన సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది.

ఈ సందర్భంగా జయ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో పోలేపల్లి షెజ్, బాలానగర్ నుంచి అడ్డాకుల వరకు ఉన్న పరిశ్రమల్లోని ఫార్మా అతి ముఖ్యమైన ఉత్ప త్తిలో కీలకమైన కార్మికులను సంఘటిత పరచడానికి, సంఘాల ఏర్పాటుకు నాయకత్వం ప్రత్యేక కేంద్రీకరణ చేపట్టాలని. సాంప్రదాయ రంగాల లతోపాటు, ఉత్పత్తిని స్తం భింపజేసే వాటిని ప్రత్యేక కేంద్రీకరణ కింద పెట్టుకొని కృషి చేయాలని, పారిశ్రామిక కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూ జిల్లాలో ఉద్యమాలు విస్తృతపరచలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సీనియ ర్ నాయకులు కిళ్లే గోపాల్, జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, కమరలి, తిరుమలయ్య వేణుగోపాల్, రాజ్ కుమార్, చంద్రకాంత్, ఆంజనేయులు, నారాయణ, చంద్రమ్మ తదితరులు ఉన్నారు.