25-08-2025 12:37:37 AM
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్
మహబూబ్‌నగర్ రూరల్, ఆగస్టు 24: అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ప్రభాకర్ పిలుపునిచ్చారు.ప్రథమ మహాసభల ప్రచార రథాన్ని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. దేశంలో అంద రికీ అన్నం పెడుతున్న రైతు ఆపదలో ఉంటే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లప్తతను చూపు తున్నాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి అందలం ఎక్కి ఆగం చేస్తున్నారని అన్నారు.
అందరికీ తిండి పెడుతున్న రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు చెల్లించాలని డిమాండ్ చేశా రు. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ చేసి న సిఫారసుల ప్రకారం వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని, పంట పొలాలకు సాగునీటి వసతిని కల్పించే ప్రాజెక్టులు అన్నిటిని పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం .కృష్ణ, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. రాము. పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర నాయకులు నరసింహ, టియుసిఐ రాష్ట్ర ఉపాధ్య క్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.