calender_icon.png 25 August, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

25-08-2025 12:35:31 AM

ఏడు తులాల బంగారం, 70 తులాల వెండి స్వాధీనం 

నాగర్ కర్నూల్ ఆగస్టు 24 (విజయక్రాంతి) మద్యానికి బానిసగా మారిన వ్యక్తి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి రాత్రిళ్ళు వరుసగా దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని బిజినపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అందుకు సంబంధించిన వివరాలను సీఐ అశోక్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. పాలెం గ్రామానికి చెందిన బత్తుల మల్లేష్ (30) అనే వ్యక్తి మద్యానికి బానిసగా మారు తూ జల్సాలకు అలవాటు పడి గత ఏడాదికాలంగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి రా త్రిళ్ళు దొంగతనాలకు పాల్పడుతుండేవాడు.

ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని వెంకట య్య అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యే క టీం ఏర్పాటు చేసి మల్లేష్ అనే వ్యక్తి పై ని ఘా ఉంచడంతో ఆదివారం తనిఖీల్లో భా గంగా పట్టుకున్నట్లు తెలిపారు. అతని అ రెస్టు చేసి విచారించాగా చోరీ చేసిన సొత్తు లో కొంత అమ్ముకొని జల్సాలు చేయగా మిగిలిన ఏడు తులాల బంగారంతో పాటు 70 తులాల వెండి ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారి వెంట ఎస్త్స్ర శ్రీనివాస్‌ఉన్నారు.