17-11-2025 08:07:55 PM
రాజాపూర్: అధికారులు గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రొబేషనల్ డిప్యూటీ కలెక్టర్ అనుమిత్ర అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో ప్రజా సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో అంగన్వాడి సెంటర్, ప్రైమరీ స్కూల్ మిడ్ డే మీల్స్, నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అధికారులు గ్రామాలలో ప్రజలకు నిత్యం అదుబాటులో ఉంది సమస్య లు పరిష్కారం చేయాలని సూచించారు. అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, తాసిల్దార్ రాధకృష్ణ, ఎంపీవో వెంకట్రాములు, ఎంఈఓ సుధాకర్ అధికారులు పీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.