17-11-2025 08:10:07 PM
జడ్చర్ల: స్థానిక డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల జడ్చర్ల, వృక్షశాస్త్ర విభాగంలో పీజీ ప్రథమ సంవత్సరంలో సాప్ట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశం పొందుటకు దరఖాస్తులను ఈ నెల 18 నుండి 21 వరకు స్వీకరిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సుకన్య ఒక ప్రకటనలో తెలిపారు. వృక్షశాస్త్రం విభాగాధిపతి డా. డి. నర్మద మాట్లాడుతూ మొదటి సంవత్సరంలో ప్రవేశం చెందుటకు డిగ్రీలో వృక్షశాస్త్రం చదివి ఉండాలని, కనీసం 55% మార్కులు పొంది వుండాలని తెలియజేశారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాల వృక్షశాస్త్రం విభాగంలో సంప్రదించవచ్చని తెలిపారు. సంవత్సరానికి రూ. 32600/- చెల్లించవలసి ఉందని పేర్కోన్నారు. దీనికి సీపీజీటీఈ ప్రవేశ పరీక్ష రాసిన వారు అలాగే రాయని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వివరాలకు 9963536233 నెంబర్ కి ఫోన్ చేయగలరని తెలిపారు.