calender_icon.png 24 July, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జానపదుల గంట

07-08-2024 12:00:00 AM

గంటలు అనేక రకాలు. గుల్లగా ఉన్న గంటలో ఒక ఊగే లోహం ముద్ద ఉంటుంది. అది గంటని తాకి శబ్దం చేస్తుంది. చేతిలో పట్టుకునే చిన్న గంటలు కొన్ని ఉన్నాయి. ఆలయంలో అమర్చిన అతి పెద్ద గంటలూ ఉన్నాయి. ఇవి కాకుండా పళ్లాల మాదిరి చిన్న పెద్ద సైజు లోహంతో చేసిన చేట సైజు వాయిద్యాలు కూడా ఉన్నాయి. దీనిని గంట లేదా తప్పెట అంటారు. 

జేగంటలు ఆదివాసులలో, జానపదులలో ప్రచారం ఉన్నాయి. జేగంట సైజు, ఉపయోగం బట్టి శబ్దం వచ్చే విధానాన్ని బట్టి అవి తయారవుతాయి. ఒకవైపు వాయించేవి ఉన్నాయి. రెండు వైపులా వాయించేవి ఉన్నాయి. బడి గంటల వేరు జేగంట మరో రకం. ఆదివాసీ తెగ అయిన సవరలకు జేగంట ఉంది. అయితే ఎవరైనా చనిపోతే దానిని వాయిస్తూ అంత్యక్రియలు జరపడానికి పది మంది కలిసి ఊరేగింపుగా పోతుంటారు.

కానీ అదే గంటల శబ్దం శిష్టులలో దేవుడిని మేల్కొలిపే వేకువ కాలపు సంగీతవాద్యం అవుతుంది. ఈ జేగంటను కంచుతో చేస్తారు. దానిని ఒక కర్రతో వాయిస్తారు. వివిధ ప్రాంతాల్లో పేర్లు వేరైనా జేగంట ఉపయోగం ఒకటే. ఇవన్నీ చదునైన పళ్లాలే. జేగంటలకు అంచుకింద ఒక రంధ్రం ఉంటుంది. దానికి తాడు కట్టి బుజానికి వేలాడదీస్తారు.

ఉత్తర హిందుస్తాన్లో ‘తాలి’ అని పిలుస్తారు. కర్ణాటక తెలుగు ప్రాంతాల్లోని దాసరులు దీనిని జేగంట అని, కథాకళి నృత్యంలో ‘చెంకల’ అని, తమిళనాడులో ‘సెమ్మన్నల్కం‘ అని అంటారు. తెలంగాణలోని ప్రతి ఉదయం బాలసంతులవారు జేగంట వాయిస్తూ చిన్న గీతం ఆలపిస్తూ అందరినీ నిద్ర లేపుతారు. జేగంట ఒక అలారం శబ్దంలాగా నిద్రలేపుకుంది. జేగంట గురించి అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది.