calender_icon.png 25 July, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదు

06-08-2024 06:42:22 PM

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, హార్ ఘర్ తిరంగా ఇన్ ఛార్జులు పాల్గొన్నారు. 'హర్ ఘర్ తిరంగా', స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ నేతలు చర్చిస్తున్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదన్నారు. బీజేపీ ఆఫీసులో రుణమాఫీకి సంబంధించి కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, రుణమాఫీ కాల్ సెంటర్ కు వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీ కాలేదని ఫోన్ చేసి రైతులు చెబుతున్నారని, రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని మంత్రి తెలిపారు.

రుణమాఫీకి ప్రాతిపదిక ఏంటో తెలియట్లేదని రైతులు చెబుతున్నారు. వచ్చే నాలుగన్నరేళ్లు భాజపా నేతలు కష్టపడి పనిచేయాలని, ప్రజా తీర్పును సవాలుగా తీసుకొని అంకితభావంతో పనిచేద్దామని ఆయన సూచించారు. ఎర్రకోటపై 11 వసారి మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయనున్నారని, రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.