26-05-2025 08:45:42 PM
పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్..
పెద్దపల్లి (విజయక్రాంతి): రోడ్డు భద్రత పాటించి ప్రమాదాలను నివారించాలని పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్(Traffic CI Anil Kumar) అన్నారు. సోమవారం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై హెల్మెట్ పెట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ డిసిపి కార్యాలయం నుండి పెద్దపల్లి కమాన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ... నేడు వాహనదారులు చాలామంది హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే ప్రమాదాలు జరిగి మరణించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ రోడ్డుపై వెళ్లే సమయంలో రోడ్డు భద్రత గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, అలాగే అత్యధిక వేగంతో వెళ్లకుండా ఉండాలని, అలాగే మద్యం తాగి వాహనాలు నడపకూడదని ప్రతి వాహనదారుడు ఇన్సూరెన్స్ లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
అలాగే మైనర్లకు ఎవరైనా వాహనాలు ఇచ్చినాచో వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ ర్యాలీలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కె ఆర్ సి శేఖర్, ఈడి శ్రీనివాస్ రెడ్డి, జిఎం లు సతీష్, సురేష్, ఎం వెంకట్రాజం, బి ఎంలు మల్లెతుల శ్రీనివాస్ యాదవ్, మహేందర్, డివో లు కొట్టే భూమయ్య, గాజుల ప్రసాద్, బాల శివప్రసాద్, దూడం సతీష్, జాన్ సాగర్ రావు, గుజ్జుల రాజిరెడ్డి, గంగుల కుమార్, అత్తె చంద్రమౌళి, జబ్బర్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.