calender_icon.png 22 July, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక చట్టాల పరిరక్షణపై ఉద్యమించాలి

26-05-2025 08:41:42 PM

సివిల్ సప్లై హమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుంపెల్లి మునీశ్వర్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): కార్మిక చట్టాల పరిరక్షణకై కార్మికులంతా కలిసికట్టుగా ఉద్యమించాలని సివిల్ సప్లై హమాలీ యూనియన్(Civil Supply Porters Union) రాష్ట్ర అధ్యక్షుడు గుంపెల్లి మునీశ్వర్ పిలుపునిచ్చారు. ఏఐటియూసి అనుబంధ సివిల్ సప్లై హామాలి వర్కర్స్ యూనియన్ మహబూబాబాద్ జిల్లా మహాసభ కేసముద్రంలో జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ సివిల్ సప్లై హమాలీ రాష్ట్ర అధ్యక్షులు గుంపల్లి మునిశ్వర్, ఏఐటీయూసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బి. అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు.

సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను కుదించి, కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తున్న కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలి రేట్లు లేవనీ, హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు రేషపల్లి నవీన్, మంద భాస్కర్, చొప్పరి శేఖర్, కాసు సాయి చరణ్, పెరుగు కుమార్, వీరవెల్లి రవి, వంకాయలపాటి జకరయ్య, రాజబోయిన శ్రీను, భానోత్ రాజు, ఎల్లుట్ల నారాయణ, అల్లరి నారాయణ, కొనకటి మల్లారెడ్డి, వెలిశాల ప్రభాకర్, సరిత తదితరులు పాల్గొన్నారు.