calender_icon.png 24 August, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూఢనమ్మకాల నిర్మూలనకు చట్టం తేవాలి

24-08-2025 05:41:54 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మూఢనమ్మకాల నిరోధక చట్టం చేయలని జన విజ్ఞాన వేదిక నిర్మల్ జిల్లా అధ్యక్షులు అంకం గంగాధర్ డిమాండ్ చేశారు. నేడు టి. ఎన్జీఓ భవన్ లో జన విజ్ఞాన వేదిక నిర్మల్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ... మంత్రాలు, చేతబడుల పేరా అమాయకుల పై దాడులు చేయడం, హత్యలు చేయడం చాల విచారకరం అని తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రమోషన్ పై ప్రభుత్వ ఉన్నత పాఠశాల బోథ్ కు పీజీహెచ్ఎంగా పదోన్నతి పొందిన గజపల్లి నర్సయ్య ను ఘనంగా సన్మానించారు.