calender_icon.png 29 December, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వాములకు అన్నదానం

29-12-2025 08:03:41 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన జాగృతి నాయకుడు బొంకురి ఐలయ్య యాదవ్ రమాదేవి దంపతులు సోమవారం అయ్యప్ప స్వాములకు, పలువురు గ్రామస్తులకు అన్నదానం చేశారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూజారి చంద్రశేఖర్ శర్మ సత్యనారాయణ స్వామి వ్రత పూజలను ఐలయ్య రమాదేవి వారి కుటుంబ సభ్యులచే ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఆడిన ఆటలు... పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి... ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.