calender_icon.png 29 December, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లాపూర్‌లో దారుణ ఘటన

29-12-2025 07:59:00 PM

డబ్బు బంగారం కోసం ఇంటి ఓనర్ ని మట్టు పెట్టిన కిరాయి దారుడు

ఉప్పల్,(విజయక్రాంతి):  ఒంటరిగా ఉన్న వృద్ధురాలు ఇంట్లో అద్దెకు దిగి డబ్బు బంగారం  కోసం ఇంటి యజమాని అయిన  వృద్ధురాలు  హత్య చేసిన ఆపై శవాన్ని కృష్ణలంక గోదావరి నదిలో పారవేసి అత్యంత దారుణమైన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ బాబా నగర్ లో చోటు చేసుకుంది.  వివరాల్లోకెళ్తే  మల్లాపూర్ బాబా నగర్ లో నివాసం ఉంటున్న సూరెడ్డి సుజాత రెడ్డి(65) ఈనెల 18న ఇంటి నుంచి బయటకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నాచారం పోలీస్ స్టేషన్ లో కనబడుటలేదని ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.  కుటుంబ సభ్యులను విచారణ అనంతరం ఇంట్లో ఉన్న కిరాయిదారుడు  పై పోలీసులకు అనుమానం వచ్చింది. సుజాత రెడ్డిని హత్య చేసింది ఇంట్లో ఉన్న కిరాయిదారుడైనని నిర్ధారించుకున్న పోలీసులురాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు మిస్సింగ్ కేసును హత్య కేసుగా నమోదు చేశారు. మిస్సింగ్ మిస్టరీని నాచారం పోలీసులు చేదించారు.

నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మండు అంజిబాబు(33) వృత్తిరీత్యా డ్రైవర్  పనిచేస్తున్నాడు. గత రెండు నెలల క్రితం మల్లాపూర్ బాబా నగర్ లోని సుజాత రెడ్డి ఇంట్లో  అద్దెకు దిగాడు. వృద్ధురాలిన సుజాత రెడ్డి ఒంటరిగా ఉండడం గమనించిన అంజి బాబు  ఆమె వద్ద ఉన్న ఇంటి పత్రాలు బంగారు నగలు డబ్బుపై కన్నేశాడు. ఆమెను హతమార్చి ఆస్తిని సొంతం చేసుకోవాలని  పక్కా ప్లాన్ చేసుకున్నాడు. 

పథకం ప్రకారం... ఈనెల 18 తేదీన సుజాత రెడ్డి ఇంట్లోకి చొరబడి  గొంతు నులిమి హత్య చేసి  ఈ విషయాన్ని తన స్నేహితులైన నాకంటి యువరాజ్ నూకల దుర్గారావుకు చెప్పాడు. వారి సహాయంతో మృతుదేహాన్ని కోనసీమ జిల్లా పరిధిలోని గోదావరి నదిలో పడివేశారు. పక్కా సమాచారంతో అంజిబాబు అదుపు తీసుకున్న  నాచారం పోలీసుల దర్యాప్తులో సుజాత రెడ్డి మిస్సింగ్ కేసు వెనుక  అంజిబాబు హస్తముందని నిర్ధారించి  అంజిబాబు హత్య కేసు నమోదు చేశారు. నిందితుడు నుండి మృతురాలు చెందిన బంగారు గొలుసు చెవి దిద్దులు నేరనికి ఉపయోగించిన సెల్ ఫోన్లు సేకరించిన నాచారం పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు. 

ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండాలి

ఇల్లు ను కిరాయికి ఇచ్చేముందు ఇంటికి వాచ్మెన్ పనిమనిషిని పెట్టుకునే ముందు స్థానిక పోలీస్ స్టేషన్ ధ్రువీకరణ పత్రం ఉంటేనే ఇంటిని అద్దెకు ఇవ్వాలని నాచారం ఇన్స్పెక్టర్ ధనంజయ గౌడ్ సూచించారు. ఇలా చేయడం వల్ల వచ్చే వ్యక్తులు నేరస్తుల లేదా   ఏదైనా నేరంలో పాల్గొన్నారా అనేది నిర్ధారణ అవుతుందన్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల ఇంటి యజమాలు  అప్రపత్తంగా ఉండాలని  ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు