calender_icon.png 23 October, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాలపై విద్యార్థులు దూరంగా ఉండాలి

23-10-2025 12:01:05 AM

డీఎస్పీ చంద్రభాను 

ఇల్లందు, అక్టోబర్ 22, (విజయక్రాంతి): ప్రభుత్వ నిషేధిత గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఇల్లందు డిఎస్పి చంద్రభాను అన్నారు. ఎస్పీ రోహిత్ రాజు పిలుపు మేరకు నవంబర్ 15వ తేదీ వరకు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా బుధవారం ఇల్లందు పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని సాహితీ డిగ్రీ కళాశాల నందు విద్యార్దినీ, విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాల బారిన పడకుండా యువతకు అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరించాలని కోరారు.

గంజాయి అక్రమ రవాణా చేసే వారి సమాచారం అందించి భాద్యత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అన్నారు.మత్తుకు బానిసలై యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు.ఎవరైనా నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ గానీ,విక్రయిస్తూ గానీ పట్టుబడితే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని,అవసరమైతే ఉన్నతాధికారుల అదేశాలతో పీడి యాక్టులను కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.