calender_icon.png 23 October, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరేసుకొని యువకుని ఆత్మహత్య

22-10-2025 10:46:04 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నెన్నెల గ్రామ సమీపంలోని మామిడి తోటల్లో బుధవారం గ్రామానికి చెందిన షేక్ యాకూబ్(25) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. మృతుని తండ్రి మహబూబ్ కథనం మేరకు మృతుడు మద్యానికి బానిసవడంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు చెప్పారు. బుధవారం మద్యం సేవించి ఇంట్లో నుండి వెళ్లిన యాకూబ్ ఎంతసేపటికి ఇంటికి రాలేదని తెలిపారు. బంధువులతో కలిసి వెతకగా ఉరి చివరిలో ఉన్న మామిడి తోటలో ఉరేసుకొని మృతి చెందింది ఉన్నట్లు తెలిపారు. మృతుని తండ్రి మెహబూబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.