calender_icon.png 23 October, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

26న రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయండి

22-10-2025 10:57:11 PM

జాతీయ మాల మహానాడు

ఖైరతాబాద్ (విజయక్రాంతి): రాజ్యాంగ హక్కుల సాధన కోసం నవంబర్ 26న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజ్యాంగ హక్కుల సాధన సభను నిర్వహిస్తున్నామని జాతీయ మాల మహానాడు వెల్లడించింది. ఈ మేరకు సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశానికి  ముఖ్యఅతిథిగా  ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ హాజరై మాట్లాడారు.. రాజ్యాంగం కల్పించిన హక్కులను కొల్లగొట్టడం, అణిచివేయడం ఈ దేశంలో అడుగడుగునా కనిపిస్తున్నాయన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రక్షణగా రాజ్యాంగాన్ని అందించాడని, జ్ఞాన యుద్ధంతో రాజకీయాలను గెలవలేని మనువాదుల కోరల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రైవేటు రంగసంస్థల్లో  రిజర్వేషన్ లను అమలుచేయాలన్నారు.పార్లమెంటు కు అంబేడ్కర్ పేరు పెట్టాలన్నారు. జాతీయ స్థాయిలో మాల మహార్ అనుబంధం కులాల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్నా రు.కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను ముద్రించి, రాజ్యాంగ పీఠికను ప్రేయర్ లో తప్పకుండా చదివేలా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బైరి రమేష్,కొండబాబు, బత్తుల లింగం తదితరులు పాల్గొన్నారు.