22-10-2025 10:41:03 PM
మామిడిపల్లిలో విషాదం..
మృతుడు గుమ్మడి బాబు, మృతికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు..
కోనరావుపేట (విజయక్రాంతి): కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గుమ్మడి బాబు అనే యువకుడు తమ ఇంటి సమీపంలో ఉన్న సెల్ టవర్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునుకి భార్య, ఇద్దరి పిల్లలు ఉన్నారు.. బాబు ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు బాబు మృతితో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కళ్ల ముందు జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.