22-10-2025 11:00:59 PM
సదరు వేడుకలకు హాజరైన మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, మధుసూదనాచారి, ఎమ్మెల్యే ముఠా గోపాల్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ప్రతియేటా దీపావళి పండుగ సందర్భంగా యాదవ కులస్తులు ఆరాధ్య దైవంగా నిర్వహించే సదరు వేడుకలు హైదరాబాద్ కు షాన్ గా నిలుస్తున్నాయని మాజీ మంత్రి టి. హరీష్ రావు అన్నారు. బుధవారం ముషీరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సదరు ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదరు వేడుకలకు మాజీ మంత్రులు టి. హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ రావు, శాసనమండలి మాజీ స్పీకర్ మధుసూదనచారి, ఎమ్మెల్యే ముఠాగో పాల్, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, కార్పొరేటర్ హేమ, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాసరావు, నాగేష్ ముదిరాజ్, బీఆర్‌ఎస్ యువ నాయకులు ముఠా జైసింహ, తలసాని సాయి యాదవ్, మాజీ కార్పొరేటర్లు వి. శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల భాగ్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... ప్రకృతిని, పశుపక్షాదులను పూజించే గొప్ప సాంస్కృతి తెలంగాణ ప్రజలకే దక్కిందన్నారు. తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు యాదవులు నిర్వహించే సదరు వేడుకలు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ గత 25 సంవత్సరాలుగా సదరు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం తోపాటు హరియానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి భారీ దున్నరాజులను తీసుకువచ్చి దున్నరాజుగా పేరుపొందారని ప్రశంసించారు. అంతకుముందు దున్న రాజులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళాప్రదర్శనలు దారిపొడవున అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సదరు ఉత్సవ నిర్వాహకులు ఎడ్ల వరుణ్ యాదవ్, అభినందన్ యాదవ్, సాయి యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు శ్రీధర్ చారి, వివేక్, సయ్యద్ అహ్మద్ భక్తియార్, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్ కుమార్, సంగిశెట్టి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.